గొడవపడితే.. 15రోజుల పాటు మాట్లాడుకోం

Shahid Kapoor Says Fights With Wife Mira Rajput Can Last Up To 15 Days - Sakshi

నా భార్యతో గొడవపడితే.. దాదాపు 15 రోజుల పాటు మాట్లాడను అంటున్నారు బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌. నేహా ధూపియా వ్యాఖ్యతగా వ్యవహరించే ఓ కార్యక్రమానికి హాజరాయ్యరు షాహిద్‌ కపూర్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దంపతులన్నకా గొడవలు సహజం. అది మంచిది కూడా. ఒకరితో ఒకరం విభేధించడం.. సమస్యలను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దాని వల్ల ఒకరి గురించి మరొకరికి పూర్తిగా అర్థం అవుతుంద’న్నారు.

‘ఇక మా విషయానికోస్తే రెండు మూడు నెలలకోసారి మేం గొడవ పడుతుంటాం. పోట్లాడుకున్నప్పుడు దాదాపు 15 రోజుల పాటు మేం మాట్లాడుకోం. తర్వాత తనో, నేనో సర్దుకు పోవడం జరుగుతుంది. ఆ తర్వాత అంతా మామూలవుతుంద’న్నారు. ప్రస్తుతం షాహీద్‌ కపూర్‌ కబీర్‌ సింగ్‌ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తెలుగు అర్జున్‌ రెడ్డికి రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top