నేను బాగానే ఉన్నాను | Shahid Kapoor reacts to stomach cancer rumours | Sakshi
Sakshi News home page

నేను బాగానే ఉన్నాను

Dec 11 2018 3:55 AM | Updated on Dec 11 2018 3:55 AM

Shahid Kapoor reacts to stomach cancer rumours - Sakshi

షాహిద్‌ కపూర్‌

కొన్ని పుకార్లకు తలా తోకా ఉండదు. ఎక్కడ నుంచి పుడతాయో కూడా తెలియదు. తాజాగా ముంబైలో ఓ పుకారు షాహిద్‌ కపూర్‌ పొట్టలోనుంచి పుట్టింది. బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ పొట్ట సంబంధిత క్యాన్సర్‌తో బాధపడుతున్నారు అన్నది ఆ వార్త సారాంశం. కానీ అందులో ఎటువంటి నిజం లేదంటున్నారు షాహిద్‌. ‘‘నేను బాగానే ఉన్నాను. అనవసరమైన పుకార్లను నమ్మకండి’’ అంటూ ట్వీట్‌ చేసి ఫ్యాన్స్‌కున్న డౌట్‌ని క్లియర్‌ చేశారు. ఈ వార్త గురించి షాహిద్‌ కుటుంబ సభ్యులు ముంబై మీడియాతో మాట్లాడుతూ – ‘‘ఏ సంఘటన ఆధారంగా ఇలాంటి కథనాలు అల్లుతారు? ఇలాంటి నిజంలేని వార్తలను ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం షాహిద్‌ ‘అర్జున్‌ రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement