అనారోగ్యంతో బాధపడుతున్నా..కంటతడి పెట్టాను: షారుక్ | Shah Rukh Khan unwell, catching up on movies on television | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో బాధపడుతున్నా..కంటతడి పెట్టాను: షారుక్

Oct 20 2013 9:26 PM | Updated on Sep 1 2017 11:49 PM

అనారోగ్యంతో బాధపడుతున్నా..కంటతడి పెట్టాను: షారుక్

అనారోగ్యంతో బాధపడుతున్నా..కంటతడి పెట్టాను: షారుక్

అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. జ్వరంతో అనారోగ్యంతో బాధపడుతున్న తాను టెలివిజన్ లో సినిమాలను చూస్తూ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నాను అని షారుక్ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో సందేశాన్ని పోస్ట్ చేశారు. తన జీవితాన్ని వెనక్కి  చూసుకోవాలంటే వయస్సుతో కాదు.. నేను నటించిన చిత్రాలతో చూసుకుంటాను అని అన్నాడు. 
 
ఇటీవల తాను నటించిన 'కల్ హో నా హో' చిత్రాన్ని నా కూతురితో కలిసి చాలా రోజుల తర్వాత టెలివిజన్ లో పూర్తిగా చూశాను. ఆ చిత్రాన్ని చూస్తూ నేను కంట తడి పెట్టాను. నా చిత్రాన్ని చూసి నేనే కన్నీరు పెట్టుకోవడం సిల్లీగా కూడా అనిపించింది. 
 
గత కొద్ది రోజులుగా తన జీవితంలో ఉత్తమ చిత్రాలుగా భావిస్తున్న 'డాన్', 'దిల్ వాలే దుల్షనియా లేజాయింగే', 'కల్ హో నా హో', చిత్రాలను చూశాను అని తెలిపాడు.  అక్టోబర్ 20వ తేది ఆదివారం రాత్రి జీ టీవీలో ప్రసారమవుతున్న 'చెన్నై ఎక్స్ ప్రెస్'  చిత్రాన్ని చూడటానికి సిద్దమయ్యాను అంటూ ట్వీట్ చేశారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement