ఆమిర్‌ వద్దనుకుంటే షారుక్‌

Shah Rukh Khan confirms Aamir Khan will play Krishna in Mahabharata web series - Sakshi

మన దర్శకధీరుడు రాజమౌళి నుంచి బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ఖాన్‌ వయా మలయాళంలో మోహన్‌లాల్‌ వరకూ ఉన్న కామన్‌ డ్రీమ్‌ మహాభారతాన్ని సిల్వర్‌ స్రీన్‌పై తీసుకురావడం. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు కూడా. ఈ సినిమాను వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో వెబ్‌ సిరీస్‌గా ఆవిష్కరించాలనుకున్నారు ఆమిర్‌ఖాన్‌. అయితే ఈ ఆలోచనను ఆపేశారని ఇటీవల పలు వార్తలు వచ్చాయి.

అయితే ఈ ప్రాజెక్ట్‌ ఇంకా డిస్కషన్స్‌లో ఉందని షారుక్‌ హింటిచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎలాంటి పాత్ర చేయాలనుంది? అని అడగ్గా – ‘‘మహాభారతం’లో శ్రీకృష్ణుడి పాత్ర చేయాలనుంది. కానీ  ఈ పాత్రను ఆమిర్‌ఖాన్‌ ఆల్రెడీ టేకప్‌ చేశారు కాబట్టి చేయడం కుదరదేమో’’ అని సమాధానం ఇచ్చారు. అంటే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే డిస్కషన్‌లో ఆమిర్‌ ఉన్నారని ఊహించవచ్చు. అన్నట్లు.. ఒకవేళ షారుక్‌ ఆకాంక్ష తెలుసుకుని ఆమిర్‌ ఈ పాత్ర చేయకపోతే అప్పుడు బాద్‌షానే శ్రీకృష్ణుడు అవుతారేమో.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top