స్టైలిష్ షాట్ కొడుతూ.. 'శభాష్‌ మిథు' ఫస్ట్‌ లుక్‌ | Shabaash Mithu Just Dropped The First Poster | Sakshi
Sakshi News home page

స్టైలిష్ షాట్ కొడుతూ.. 'శభాష్‌ మిథు' ఫస్ట్‌ లుక్‌

Jan 29 2020 1:38 PM | Updated on Jan 29 2020 1:43 PM

Shabaash Mithu Just Dropped The First Poster  - Sakshi

ప్ర‌స్తుతం దేశంలో బ‌యోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే ధోని, సచిన్ ఇలా ఎందరో క్రీడాకారుల జీవితాలపై సినిమాలు రూపొందిన సంగతి తెల్సిందే. వారి దారిలోనే మ‌హిళా ప్రపంచ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి అంద‌రి దృష్టిని ఆకర్షించిన ఉమెన్‌ క్రికెట‌ర్ మిథాలీ రాజ్. భార‌త్ క్రికెట్‌కి ఎన‌లేని సేవ‌లందించిన ఆమె జీవిత నేప‌థ్యంలో తాజాగా ఓ బ‌యోపిక్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌యాకామ్ 18 సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది.

మిథాలీ బయోపిక్‌లో ఆ నటి..

ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో తాప్సీ న‌టిస్తోంది. షారుఖ్ ఖాన్‌తో ‘రాయీస్’ మూవీ రూపొందించిన రాహుల్ డోలాకియా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ‘శ‌భాష్ మిథు’ పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. కాగా నేడు సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుదలైంది. ఇందులో తాప్సీ మిథాలీ పాత్ర‌లో ఒదిగిపోయి.. స్టైలిష్ షాట్ కొడుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.  2021 ఫిబ్రవరి 2న సినిమాను విడుదల చేయనున్నట్లు పోస్టర్‌ ద్వారా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement