సీనియర్‌ నటుడు కేకే శర్మ కన్నుమూత | Senior actor KK Sharma is dead | Sakshi
Sakshi News home page

సీనియర్‌ నటుడు కేకే శర్మ కన్నుమూత

May 19 2017 12:08 AM | Updated on Jul 31 2018 5:31 PM

సీనియర్‌ నటుడు కేకే శర్మ కన్నుమూత - Sakshi

సీనియర్‌ నటుడు కేకే శర్మ కన్నుమూత

సీనియర్‌ నటుడు కేకే శర్మ (84) హైదరాబాద్‌లో గురువారం గుండెపోటుతో కన్నుమూశారు.

సీనియర్‌ నటుడు కేకే శర్మ (84) హైదరాబాద్‌లో గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు కళ్లేపల్లి శ్రీ వెంకటరామ కామేశ్వర శర్మ. కేకే శర్మ బరంపురంలో జన్మించారు. నటనపై ఉన్న మక్కువతో రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి, చిత్రపరిశ్రమకు వచ్చారు. ఎన్టీఆర్, జయలలిత జంటగా విఠలాచార్య దర్శకత్వంలో డీవీఎస్‌ రాజు నిర్మించిన ‘గండికోట రహస్యం’ సినిమాతో సినీ జీవితాన్ని ఆరంభించారు.

తొలుత చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ తర్వాత ప్రధాన పాత్రల్లో నటించారాయన. 500కు పైగా సినిమాల్లో నటించారు. ఆయన చివరి చిత్రం ‘హైటెక్‌ మర్డర్‌’. కొందరి స్నేహితుల భాగస్వామ్యంతో ‘గోల నాగమ్మ’ చిత్రాన్ని కూడా నిర్మించారు. హైదరాబాద్‌లో శుక్రవారం కేకే శర్మ అంత్యక్రియలు జరుగుతాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement