సెల్ఫీ... సో స్పెషల్! | Selphi ... So Special! | Sakshi
Sakshi News home page

సెల్ఫీ... సో స్పెషల్!

Mar 27 2016 10:35 PM | Updated on Sep 3 2017 8:41 PM

సెల్ఫీ...  సో స్పెషల్!

సెల్ఫీ... సో స్పెషల్!

శ్రద్ధగా మేకప్ చేసుకున్నప్పుడు సెల్‌ఫోన్‌తో ఓ సెల్ఫీ తీసుకుని, తీపి గుర్తుగా దాచుకోవాలనుకుంటాం.

శ్రద్ధగా మేకప్ చేసుకున్నప్పుడు సెల్‌ఫోన్‌తో ఓ సెల్ఫీ తీసుకుని, తీపి గుర్తుగా దాచుకోవాలనుకుంటాం. విహార యాత్రకు వెళ్లినప్పుడు అందమైన లొకేషన్స్‌లో సెల్ఫీ తీసుకుంటాం. చానాళ్ల తర్వాత స్నేహితులను కలిసినప్పుడు వాళ్లతో సెల్ఫీ దిగుతాం. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదీ సెల్ఫీకి అనర్హం. సినిమా తారలు ట్విట్టర్స్, ఫేస్‌బుక్స్‌లో ఇలాంటి సెల్ఫీలు చాలా కనిపిస్తాయి.

అలా గత వారంలో హల్‌చల్ చేసిన సెల్ఫీల్లో రామ్‌చరణ్, వరుణ్‌తేజ్ కలిసి దిగిన సెల్ఫీ ఓ హైలైట్. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి నేడు బెంగళూరులో జరగనున్న విషయం తెలిసిందే. వివాహ వేడుక జరుగుతున్న ప్రాంగణంలో చరణ్, వరుణ్ సెల్ఫీ దిగారు. ఆదివారం చరణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా తాము దిగిన సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, ‘హ్యాపీ బర్త్‌డే అన్నా.. లవ్ యు’ అని పేర్కొన్నారు వరుణ్ తేజ్.

ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులో మెరిసే శ్రుతీహాసన్ ‘సింగమ్ 3’ చిత్రం కోసం పట్టుచీర కట్టుకున్నారు. అందుకని మురిపెంగా సెల్ఫీ దిగి, ఫేస్‌బుక్‌లో పెట్టారు. తల్లితో కలిసి రకుల్ ప్రీత్‌సింగ్ అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లారు. అక్కడ టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో తల్లితో కలిసి సెల్ఫీ దిగారు. హిందీ చిత్రం ‘పింక్’ షూటింగ్ స్పాట్‌లో షాట్ గ్యాప్‌లో కో-స్టార్స్‌తో కలిసి తాప్సీ ఓ సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీలు సో... స్పెషల్‌గా ఉన్నాయి కదూ!
 

Advertisement
 
Advertisement
Advertisement