కోచ్‌ జ్వాల | Sakshi
Sakshi News home page

కోచ్‌ జ్వాల

Published Sun, Feb 9 2020 12:17 AM

Seetimaar Movie Team Released on Tamanna First Look - Sakshi

కబడ్డీ కోచ్‌ జ్వాలారెడ్డిగా మారిపోయారు తమన్నా. ‘గౌతమ్‌నంద’ (2017) చిత్రం తర్వాత గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో కబడ్డీ ఆట నేపథ్యంలో ‘సీటీమార్‌’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా తమన్నా, దిగంగనా సూర్యవన్షీ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసాచిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ మహిళల జట్టు కోచ్‌ జ్వాలారెడ్డి పాత్రలో తమన్నా నటిస్తున్నారు. దర్శకుడు సంపత్‌ నంది కుమారుడు యువ ఓ గెస్ట్‌ రోల్‌ చేస్తున్నారు. శనివారం జ్వాలారెడ్డి లుక్‌ను విడుదల చేశారు. ‘‘నా పాత్ర చాలెంజింగ్‌గా, ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు తమన్నా. ‘‘హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో కొత్త షెడ్యూల్‌ మొదలుపెట్టాం. సమ్మర్‌లో  సినిమాను  రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి.

Advertisement
 
Advertisement