సిన్సియర్‌ ప్రేమ

Seenugadi Prema Movie Trailer - 2018 - Sakshi

‘‘శీనుగాడి ప్రేమ’ సినిమా పాటలు, టీజర్‌ బాగున్నాయి. నటీనటులు కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా నటించారు. ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ అన్నారు. ఆర్‌.కేని దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీనివాసరావు హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘శీనుగాడి ప్రేమ’. ‘సిన్సియర్‌ రా మామా’ అన్నది ట్యాగ్‌ లైన్‌.

ప్రణవి, కావేరి, చాందిని కథానాయికలు. రమణ సాకే స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నాకు యాక్టింగ్‌ అంటే ఇష్టం. నేను డైలాగ్స్‌ చెప్పే విధానం చూసిన డైరెక్టర్‌ హీరోగా నటించమన్నారు. కథ కూడా బాగుండటంతో నటించి, నేనే నిర్మించాను’’ అన్నారు. ‘‘శీను పేరున్న వారికి కనెక్టయ్యే కథాంశంతో ఈ సినిమా చేశాం. లవ్, కామెడీ, ఎమోషన్‌.. ఇలా ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలుంటాయి’’ అన్నారు ఆర్‌.కె.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top