సిన్సియర్‌ రా మామా | seenu gadi prema katha RELEASE SHORTLY | Sakshi
Sakshi News home page

సిన్సియర్‌ రా మామా

Dec 22 2017 12:30 AM | Updated on Dec 22 2017 12:30 AM

శ్రీనివాసరావు, ప్రణవి, కావేరి, చాందినీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘శీనుగాడి ప్రేమ’. ‘సిన్సియర్‌ రా మామా’ అన్నది ఉపశీర్షిక. ఆర్‌.కె.డి. దర్శకత్వంలో సుష్మా ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా పతాకంపై ధరిమిశెట్టి సత్యేశ్వరి నిర్మించిన ఈ సినిమా డబ్బింగ్‌ జరుపుకుంటోంది. నిర్మాత సత్యేశ్వరి మాట్లాడుతూ– ‘‘లవ్, సెంటిమెంట్, యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. వినోదానికీ పెద్దపీట వేశాం. ఆర్‌.కె.డి. చెప్పిన కథను తెరపై చక్కగా ఆవిష్కరించారు. హైదరాబాద్, అరకు, వైజాగ్, కాణిపాకం, తిరుపతి, చెన్నైలోని అందమైన ప్రదేశాల్లో ఐదు పాటలు చిత్రీకరించాం. త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అన్నివర్గాల ప్రేక్షకులను మా చిత్రం ఆకట్టుకుని, విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. రాంపల్లి వెంకటరమణ, రమ్య, భవాని తదితరులు నటించిన ఈ చిత్రా నికి కెమెరా: సతీష్, సంగీతం: రమణ.

Advertisement
 
Advertisement
Advertisement