బాలయ్యకు జోడీ కుదరటం లేదు | search continues for balakrishnas gauthami puthra shathakarni heroine | Sakshi
Sakshi News home page

బాలయ్యకు జోడీ కుదరటం లేదు

May 28 2016 11:38 AM | Updated on Aug 29 2018 1:59 PM

బాలయ్యకు జోడీ కుదరటం లేదు - Sakshi

బాలయ్యకు జోడీ కుదరటం లేదు

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం గౌతమీ పుత్రశాతకర్ణి. బాలకృష్ణ వందో సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రం ఇటీవల తొలి షెడ్యూల్ పూర్తి...

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం గౌతమీ పుత్రశాతకర్ణి. బాలకృష్ణ వందో సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రం ఇటీవల తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలు తెరకెక్కించే మొరాకోలోని లొకేషన్స్‌లో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. బాలయ్య కెరీర్‌లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌కు రెడీ అవుతోంది.

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని బాలకృష్ణ తల్లి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఇంతవరకు హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తయినా హీరోయిన్ విషయంలో యూనిట్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ముందుగా నయనతారను తీసుకోవాలని భావించినా, డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో పక్కన పెట్టేశారు. ప్రస్తుతం బాలయ్య ఇమేజ్ కు, వయసుకు తగ్గ హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో హీరోయిన్ ను ఫైనల్ చేసి రెండో షెడ్యూల్ ప్రారంభించాలని భావిస్తున్నాడు క్రిష్.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement