gauthami puthra shathakarni
-
బాలయ్యకు జోడీ కుదరటం లేదు
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం గౌతమీ పుత్రశాతకర్ణి. బాలకృష్ణ వందో సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రం ఇటీవల తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. హాలీవుడ్ యాక్షన్ చిత్రాలు తెరకెక్కించే మొరాకోలోని లొకేషన్స్‌లో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. బాలయ్య కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెకండ్ షెడ్యూల్‌కు రెడీ అవుతోంది. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని బాలకృష్ణ తల్లి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఇంతవరకు హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తయినా హీరోయిన్ విషయంలో యూనిట్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ముందుగా నయనతారను తీసుకోవాలని భావించినా, డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో పక్కన పెట్టేశారు. ప్రస్తుతం బాలయ్య ఇమేజ్ కు, వయసుకు తగ్గ హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వారంలో హీరోయిన్ ను ఫైనల్ చేసి రెండో షెడ్యూల్ ప్రారంభించాలని భావిస్తున్నాడు క్రిష్. -
బాలయ్యకు నో చెప్పిందా..?
ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్ల కష్టాలు ఎక్కువవుతున్నాయి. తమ ఇమేజ్ కు, ఏజ్ కు తగ్గ హీరోయిన్లు తక్కువగా ఉండటంతో హీరోయిన్ల కోసం తిప్పలు తప్పడం లేదు. నయనతార, అనుష్క లాంటి ఒకరిద్దరు మాత్రమే సీనియర్ హీరోలకు సెట్ అవుతారని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ హీరోయిన్లు లేడీ ఓరియంటెడ్ సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేస్తుండటంతో స్టార్ హీరోలకు ఎదురుచూపులు తప్పటం లేదు. తాజాగా నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా విషయంలోనూ ఇదే సమస్య ఎదురైంది. ముందుగా ఈ సినిమా కోసం నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. అయితే అదే సమయంలో చిరు 150వ సినిమాతో పాటు తమిళ్ లో కూడా మరికొన్ని సినిమాలు అంగీకరించి ఉండటంతో బాలయ్యకు నో చెప్పింది. ఇక అంజలీ విషయంలోనూ అదే జరిగింది. తరువాత కాజల్ హీరోయిన్ గా ఫైనల్ చేయాలని భావించినా వర్క్ అవుట్ కాలేదు. చాలా రోజులుగా టాలీవుడ్ లో రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్న గోవా బ్యూటీ ఇలియానాకు ఛాన్స్ ఇద్దామని భావించినా ఈ అమ్మడు కూడా బాలయ్యకు నో చెప్పేసిందన్న టాక్ వినిపిస్తోంది. సీనియర్ హీరోల సరసన నటిస్తే కెరీర్ త్వరగా ముగిసిపోతుందన్న భయంతోనే ఇలియానా బాలయ్యకు నో చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. అసలే అవకాశాల్లేక కష్టాల్లో ఉన్న సమయంలో బాలయ్య లాంటి స్టార్ హీరో సరసన ఛాన్స్ వస్తే కాదనటం కర్టెక్ట్ కాదంటున్నారు విశ్లేషకులు.