రణవీర్తో రొమాన్స్ సీన్లు అలా ఉండవు: ఐష్ | Scenes with Ranbir in ADHM not frivolous sensuality: Aishwarya | Sakshi
Sakshi News home page

రణవీర్తో రొమాన్స్ సీన్లు అలా ఉండవు: ఐష్

Oct 22 2016 6:29 PM | Updated on Sep 4 2017 6:00 PM

రణవీర్తో రొమాన్స్ సీన్లు అలా ఉండవు: ఐష్

రణవీర్తో రొమాన్స్ సీన్లు అలా ఉండవు: ఐష్

ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో హీరో రణవీర్ కపూర్తో తాను నటించిన రొమాన్స్ సన్నివేశాలపై అందాలతార ఐశ్వర్యా రాయ్ వివరణ ఇచ్చింది.

ముంబై: ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో హీరో రణవీర్ కపూర్తో తాను నటించిన రొమాన్స్ సన్నివేశాలపై అందాలతార ఐశ్వర్యా రాయ్ వివరణ ఇచ్చింది. ఈ దృశ్యాలు అసభ్యకరంగా ఉండవని, కళాత్మకంగా ఉంటాయని చెప్పింది. విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లో ఐష్ హాట్హాట్గా కనిపించిన సంగతి తెలిసిందే. పొట్టి దుస్తులు వేసుకుని రణవీర్ పక్కన ఐష్ రెచ్చిపోవడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. అంతేగాక రణవీర్, ఐష్ నటించిన కొన్ని రొమాన్స్ దృశ్యాలను సెన్సార్ బోర్డు కట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి.

ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో తాను ఎక్కడా పరిధిదాటి నటించలేదని ఐష్‌ అంటోంది. 'ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. దర్శకుడి సలహా మేరకు హుందాగా నటించాను. హీరో రణవీర్తో కలసి చేసిన ఆన్ స్ర్కీన్ రొమాన్స్ కళాత్మకంగా ఉంటుంది. దీని గురించి నేను ఆందోళన చెందడం లేదు' అని ఐష్ చెప్పింది. దర్శకుడు కరణ్ జోహార్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఐశ్వర్య తన పాత్ర ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, అద్భుతంగా నటించిందని చెప్పాడు. ఈ సినిమాలో స్కిన్ షో లేదా లిప్ లాక్ సన్నివేశాలు లేవని తెలిపాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement