భయపెట్టే మాయ | Scared Magic | Sakshi
Sakshi News home page

భయపెట్టే మాయ

Published Wed, Apr 9 2014 11:05 PM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

భయపెట్టే మాయ

చిరుసాయి, హేమంత్, శ్రుతి, ఝాన్సీ ముఖ్య తారలుగా దినకరన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అందమైన మాయ’. పాటల చిత్రీకరణ మినహా సినిమా పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాణ నిర్వాహకుడు నాగరాజు కొట్టి మాట్లాడుతూ -‘‘హారర్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. కథానుసారం దట్టమైన అడవుల్లో షూటింగ్ చేశాం. మరో పది రోజులు జరిపే షూటింగ్‌తో పాటల చిత్రీకరణ పూర్తవుతుంది. ఈ నెల చివరి వారంలో పాటలు విడుదల చేయనున్నాం. ఈ పాటల్లో ఉన్న ఓ ఐటమ్ సాంగ్ ‘కెవ్వు కేక...’ స్థాయిలో హిట్టవుతుంది’’ అని చెప్పారు. ‘‘దాదాపు ఏడు నెలలు కథాంశాన్ని డెవలప్ చేసి, ఆ తర్వాత షూటింగ్‌కి వెళ్లాం’’ అని దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న మణీంద్రన్ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement