'ట్రైలర్ చూశాక.. బాహుబలి చూడాలనిపించలేదు' | Sayani Gupta sensational comments on Baahubali | Sakshi
Sakshi News home page

'ట్రైలర్ చూశాక.. బాహుబలి చూడాలనిపించలేదు'

Sep 4 2017 1:52 PM | Updated on Sep 17 2017 6:23 PM

'ట్రైలర్ చూశాక.. బాహుబలి చూడాలనిపించలేదు'

'ట్రైలర్ చూశాక.. బాహుబలి చూడాలనిపించలేదు'

బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాపై బాలీవుడ్ తారలు ఇంకా అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు.

బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాపై బాలీవుడ్ తారలు ఇంకా అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. హిందీ సినిమాలను మించి భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాపై బాలీవుడ్ స్టార్ హీరోలెవరూ స్పందించకపోవటం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆలస్యంగా స్పందించిన షారూఖ్, సల్మాన్, ఆమిర్ లు సినిమా చూడలేదుగానీ.. బాహుబలి విజయం గర్వకారణం అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు.

తాజాగా మరో బాలీవుడ్ నటి బాహుబలి సినిమాపై ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి ట్రైలర్ చూశాక ఈ సినిమా చూడాలన్న ఆసక్తి కలగలేదని తెలిపారు సయానీ గుప్తా. అంతేకాదు బాహుబలి లాంటి సినిమాలో నటించే అవకాశం వచ్చినా తాను అంగీకరించనన్నారు. బాహుబలిని హాలీవుడ్ చిత్రాలతో పోల్చలేమని, అది కేవలం భారీ చిత్రం మాత్రమేనని తెలిపారు. సయానీ ప్రస్తుతం నవాజుద్ధీన్ సిద్ధికీకి జోడి హంగ్రీ సినిమాలో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement