ఫారిన్‌ పోదాం | 'Savyasachi' enters final lap | Sakshi
Sakshi News home page

ఫారిన్‌ పోదాం

Jul 31 2018 1:56 AM | Updated on Jul 31 2018 1:56 AM

'Savyasachi' enters final lap - Sakshi

నాగచైతన్య

సవ్యసాచి తన గమ్యాన్ని చేరుకోవడానికి జస్ట్‌ కొంచెం దూరంలోనే ఉన్నాడు. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సవాళ్లేంటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు చందు   మొండేటి. నాగచైతన్య, నిధీ అగర్వాల్‌ హీరో, హీరోయిన్‌లుగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. మాధవన్, భూమిక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యర్నేని, వై. రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో నాగచైతన్య యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌గా కనిపించనున్నారు.

రెండు చేతులను ఒకే సామర్థ్యంతో ఉపయోగించగలిగే సవ్యసాచిలా నాగచైతన్య రోల్‌ ఉంటుందని తెలిసిన విషయమే. ఈ సినిమా షూటింగ్‌ లాస్ట్‌ షెడ్యూల్‌లో ఉంది. ‘‘టాకీ పార్ట్‌ ఆగస్ట్‌ 8తో కంప్లీట్‌ చేస్తాం. ఒక సాంగ్‌ను ఫారిన్‌లో షూట్‌ చేయనున్నాం. అది ఆగస్ట్‌ 15కల్లా పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్, సిజీ వర్క్స్‌ అన్నీ కూడా సెప్టెంబర్‌ 15 లోపు కంప్లీట్‌ చేస్తాం. త్వరలో రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే, నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ ఆగస్టు 31న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement