‘మహానటి’ వాయిదా పడిందా..? | Savithri Biopic Mahanati Release Postponed | Sakshi
Sakshi News home page

Mar 2 2018 3:37 PM | Updated on Mar 2 2018 4:55 PM

Savithri Biopic Mahanati Release Postponed - Sakshi

మహానటి మూవీ పోస్టర్‌

అలనాటి అందాల తార సావిత్రి జీవిత కథ ఆధారంగా మహానటి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. దుల్కర్ సల్మాన్‌, సమంత, విజయ్‌ దేవరకొండ, ప్రకాష్ రాజ్‌ లాంటి తారలు నటిస్తున్న ఈ సినిమాకు ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

ముందుగా ఈ సినిమాను మార్చి 29న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా రిలీజ్‌ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ఇంకా షూటింగ్ పనులు పూర్తి కాకపోవటంతో పాటు మార్చి 30న భారీ అంచనాలున్న రంగస్థలం రిలీజ్ అవుతుండటంతో మహానటి విడుదలను వాయిదా వేశారు. ఏప్రిల్‌ నెలలో కూడా పెద్ద సినిమాల రిలీజ్ ఉండటంతో వేసవి చివర్లో సినిమా రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారట. త్వరలో కొత్త రిలీజ్‌ డేట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement