ప్రేమకూ... పెళ్లికీ మధ్య! | Sathamanam Bhavathi Movie release on Sankranthi | Sakshi
Sakshi News home page

ప్రేమకూ... పెళ్లికీ మధ్య!

Nov 1 2016 11:26 PM | Updated on Sep 4 2017 6:53 PM

ప్రేమకూ... పెళ్లికీ మధ్య!

ప్రేమకూ... పెళ్లికీ మధ్య!

సిటీలో ఉంటున్న అమ్మాయి సెలవులకు పల్లెటూరికి వస్తుంది. వరసకు బావయ్యే అబ్బాయితో ప్రేమలో పడింది.

సిటీలో ఉంటున్న అమ్మాయి సెలవులకు పల్లెటూరికి వస్తుంది. వరసకు బావయ్యే అబ్బాయితో ప్రేమలో పడింది. ఈ జంటను దేవతలందరూ ‘శతమానం భవతి’ అని దీవించారు. మరి, కుటుంబ పెద్దల దీవెనల కోసం ఏం చేశారు? ప్రేమకూ, పెళ్లికీ మధ్య ఏమైంది? - శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ జంటగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శతమానం భవతి’ చిత్రకథ చూచాయగా ఇదేనట. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ నేడు మొదలైంది.

నవంబర్ నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తి కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘తాతా మనవళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న అందమైన కుటుంబ కథా చిత్రమిది. హైదరాబాద్, ఉభయ గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ జరుపుతున్నాం. వచ్చే సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ప్రకాశ్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రధారులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement