నా కెరీర్‌లో ఇలాంటి సంక్రాంతి చూడలేదు

Sarileru Neekevvaru Movie Press Meet - Sakshi

– ‘దిల్‌’ రాజు

‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు అవుతోంది. నా కెరీర్‌లో ఇప్పటివరకు ఇలాంటి సంక్రాంతిని చూడలేదు’’ అని అన్నారు ‘దిల్‌’ రాజు. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ‘దిల్‌’ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైన సంగతి తెలిసిందే. తమ సినిమాకు మంచి స్పందన, కలెక్షన్స్‌ వస్తున్నాయని చిత్రబృందం చెబుతోంది.

ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘కేవలం ఐదు నెలల్లో సినిమాను పూర్తి చేసి ‘సరిలేరు మాకెవ్వరు’ అనిపించారు మహేశ్‌బాబు, అనిల్‌ రావిపూడి. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని బ్లాక్‌ బస్టర్‌కా బాప్‌ అనే స్థాయిలో రెవెన్యూ క్రియేట్‌ చేసి డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ నిజమైన సంక్రాంతి అనుకునేలా చేశారు అనిల్‌. మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌కు, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి హాయ్యస్ట్‌ రెవెన్యూ కలెక్ట్‌ చేసిన సినిమాగా చేశారు అనిల్‌.

డిస్ట్రిబ్యూటర్స్‌కు ఎంత లాభాలు కావాలో అంత లాభం వచ్చింది. ఇంకా ఈ చిత్రం ఎంత కలెక్ట్‌ చేస్తుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. ఈ సంక్రాంతికి ఇంత మంచి రెవెన్యూ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘సంక్రాంతి పండగ ముగిసిపోయింది. కానీ పండక్కి విడుదలైన సినిమాలకు సంక్రాంతి ఇంకా నడుస్తూనే ఉంది. మహేశ్‌గారి కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అంటే మామూలు విషయం కాదు. అనిల్‌ కష్టానికి తగిన ప్రతిఫలం మా అందరికీ వచ్చింది. మేము ఊహించిన కలెక్షన్స్‌ కన్నా ఎక్కువ కలెక్షన్స్‌ వస్తున్నాయి.

తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్‌ సంక్రాంతి అంటూ కొందరు డిస్ట్రిబ్యూటర్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సంక్రాంతిలో మా సినిమా ఉండటం సంతోషంగా ఉంది’’ అన్నారు అనిల్‌ సుంకర. ‘‘సంక్రాంతికి బాక్సాఫీస్‌ దద్దరిల్లిపోయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని మహేష్‌గారి కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిపిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇంకా మూడు వారాల రన్‌ ఉంది. సినిమాలో కొత్తగా 90సెకన్లు ఉండే ఓ సీన్‌ను జోడించబోతున్నాం. దాంతో ఇంకొంచెం నవ్వులు బోనస్‌గా లభిస్తాయి. సినిమాను మళ్లీ చూడాలనుకునేవారికి, కొత్తగా చూడాలనుకునేవారి కోసం ఈ సీన్‌ను యాడ్‌ చేస్తున్నాం. ఎప్పుడు యాడ్‌ చేస్తామనేది త్వరలో చెబుతాం’’ అన్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top