నువ్వెళ్లే రహదారికి జోహారు

Sarileru Neekevvaru intro video released on Mahesh Babu birthday - Sakshi

మేజర్‌ అజయ్‌కృష్ణ రిపోర్ట్‌ చేశాడు. పుట్టినరోజు నాడు ఇంట్రో టీజర్‌తో ఆడియన్స్‌కు మంచి కిక్‌ ఇచ్చాడు. మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో మేజర్‌ అజయ్‌కృష్ణ పాత్రలో నటిస్తున్నారు మహేశ్‌. శుక్రవారం (ఆగస్టు 9) మహేశ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా ఇంట్రో టీజర్‌తో పాటు మహేశ్‌ లుక్‌ను విడుదల చేశారు.

‘సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్లే రహదారికి జోహారు... సరిలేరు నీకెవ్వరు.. ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు’ అనే లిరిక్స్‌తో ఇంట్రో టీజర్‌ అదరిపోయిందంటున్నారు ఫ్యాన్స్‌. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. రాజేంద్రప్రసాద్, విజయశాంతి, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top