బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ అదే! | Sanjay Leela Bhansali’s birthday gift for Deepika Padukone | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ అదే!

Feb 1 2018 12:50 AM | Updated on Feb 1 2018 12:50 AM

Sanjay Leela Bhansali’s birthday gift for Deepika Padukone - Sakshi

దీపికా పదుకోన్

రీసెంట్‌ (జనవరి 5)గా బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు దీపికా పదుకోన్‌. ఆ రోజు ఆమెకు ఎన్నో గిప్ట్స్‌ వచ్చి ఉండొచ్చు. ఎందరో విషెస్‌ చెప్పి ఉండొచ్చు. ‘‘అయితే నా బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ అంటే దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ చెప్పిన ఒక మాట’’ అంటున్నారు దీపికా పదుకోన్‌. ‘పద్మావత్‌’ చిత్రం జనవరి 25న రిలీజైన విషయం తెలిసిందే. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్, షాహిద్‌ కపూర్‌ ముఖ్య తారలుగా నటించారు. ఈ సినిమా సెన్సార్‌ జనవరి 5న కంప్లీట్‌ అయ్యింది.

సెన్సార్‌ బోర్డ్‌ ఏమంటుందో? రివైజింగ్‌ కమిటీకి పంపడంటూ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా కాలయాపన చేస్తుందేమో అనే టెన్షన్‌ చిత్రబృందంలో ఉండేది. అయితే సెన్సార్‌ వైజ్‌గా యూనిట్‌ ఇబ్బందిపడలేదు. ఇక్కడ విశేషం ఏంటంటే.. దీపికా బర్త్‌డే నాడే ‘పద్మావత్‌’ సెన్సార్‌ కంప్లీట్‌ అయిన విషయాన్ని భన్సాలీ ఫోన్‌లో దీపికకు చెప్పారట. ‘‘ఫ్యామిలీ మెంబర్స్‌తో బర్త్‌డే పార్టీని ఎంజాయ్‌ చేస్తున్నాను. ఆ టైమ్‌లో సంజయ్‌లీలా భన్సాలీ ఫోన్‌ చేసి ‘పద్మావత్‌’ సెన్సార్‌ కంప్లీట్‌ అయిన విషయాన్ని చెప్పారు. మోస్ట్‌ ప్రిషియస్‌ అండ్‌ బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ అదే’’ అని దీపికా పదుకోన్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement