అధీర అడుగుపెట్టాడు | sanjay dutt joining in kgf chapter 2 | Sakshi
Sakshi News home page

అధీర అడుగుపెట్టాడు

Sep 26 2019 12:41 AM | Updated on Sep 26 2019 12:41 AM

sanjay dutt joining in kgf chapter 2 - Sakshi

ప్రశాంత్‌ నీల్‌, సంజయ్‌ దత్‌

ఫస్ట్‌ పార్ట్‌లో రాకీ భాయ్‌ (యశ్‌) చాలా మంది విలన్లనే ఎదుర్కొన్నాడు. కానీ యుద్ధం ఇంకా అయిపోలేదు. పెద్ద పెద్ద విలన్‌లు ముందున్నారు. అందులో అధీర ముఖ్యుడు. ఇప్పుడు తనని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాడు రాకీ. గత ఏడాది వచ్చిన ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1’ కథాంశం ఇది. యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 1970లలో కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ చుట్టూ సాగే యాక్షన్‌ చిత్రం ‘కేజీఎఫ్‌’. ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో అధీర అనే విలన్‌ పాత్ర చేస్తున్నారు సంజయ్‌. బుధవారం ఈ సినిమా షూటింగ్‌లో సంజయ్‌ దత్‌ జాయిన్‌ అయ్యారు. హొంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement