సహచరుడి కథతో సినిమా | Sanjay Dutt Commitments After Release | Sakshi
Sakshi News home page

సహచరుడి కథతో సినిమా

Jan 31 2016 2:44 PM | Updated on Sep 3 2017 4:42 PM

సహచరుడి కథతో సినిమా

సహచరుడి కథతో సినిమా

జైలు జీవితం ముగించుకొని విడుదలకు రెడీ అవుతున్న సంజయ్ దత్ బయటకు వచ్చాక ఏం చేస్తాడు.

జైలు జీవితం ముగించుకొని విడుదలకు రెడీ అవుతున్న సంజయ్ దత్ బయటకు వచ్చాక ఏం చేస్తాడు. ఇప్పుడు బాలీవుడ్ సినీ అభిమానులతో పాటు సినీ ప్రముఖులను కూడా వేధిస్తున్న ప్రశ్న ఇది. దాదాపు మూడు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపిన సంజయ్ విడుదల తరువాత తిరిగి సినిమాల్లో కొనసాగుతాడా..? లేక వ్యక్తిగత జీవితంలో బిజీ అవుతాడా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు అభిమానులను మదిలో మెదలుతున్నాయి.

సంజయ్ మాత్రం తిరిగి సినిమాల్లో నటించడానికే నిర్ణయించుకున్నాడట. శిక్ష అనుభవిస్తున్న సమయంలో కూడా పెరోల్ మీద బయటికి వచ్చి ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సంజూభాయ్, విడుదలైన తరువాత పూర్తిగా సినిమాల మీదే దృష్టి పెట్టడానికి రెడీ అవుతున్నాడు. అంతేకాదు సొంతంగా ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి, తన బ్యానర్పై సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతున్నాడు.

తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా తొలి చిత్రంగా, జైలులో తనతో పాటు గడిపిన వ్యక్తి జీవితాన్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అతని జీవిత విశేషాలతో కథ రెడీ చేసే పనిలో ఉన్నారు సంజయ్ టీం. ఈ సినిమాతో పాటు తన స్నేహితుడు రాజ్ కుమార్ హిరానీతో కలిసి మున్నాబాయ్ సిరీస్లో మూడో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఈ నెల 25న రిలీజ్ అవుతున్న సంజయ్, ఇక వెండితెర మీద సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement