తమిళ తెరపై జోరు చూపిస్తున్నాడు | Sandeep kishan tamil film with cv kumar | Sakshi
Sakshi News home page

తమిళ తెరపై జోరు చూపిస్తున్నాడు

Sep 19 2015 8:45 AM | Updated on Sep 15 2019 12:38 PM

తమిళ తెరపై జోరు చూపిస్తున్నాడు - Sakshi

తమిళ తెరపై జోరు చూపిస్తున్నాడు

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు కమిట్ అయ్యాడు. సపోర్టింగ్ రోల్లో ఎంట్రీ ఇచ్చి, తరువాత హీరోగా మారిన సందీప్ ఎక్కువగా లవ్ స్టోరిలనే చేస్తూ వచ్చాడు. టైగర్ సినిమాతో యాక్షన్ జానర్ ట్రై...

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు కమిట్ అయ్యాడు. సపోర్టింగ్ రోల్లో ఎంట్రీ ఇచ్చి, తరువాత హీరోగా మారిన సందీప్ ఎక్కువగా లవ్ స్టోరిలనే చేస్తూ వచ్చాడు. టైగర్ సినిమాతో యాక్షన్ జానర్ ట్రై చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో టాలీవుడ్లో కాస్త స్లో అయ్యాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు సందీప్ కిషన్.

ఇప్పటికే తమిళ్లో రెజీనాతో కలిసి ఓ కామెడీ థ్రిల్లర్ని కంప్లీట్ చేశాడు సందీప్ కిషన్.. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ఇప్పుడు మరో ద్విభాషా చిత్రానికి కమిట్ అయ్యాడు. సూదుకవ్వం, తెగడి లాంటి సూపర్ హిట్స్ను నిర్మించిన సివి కుమార్ తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్న సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను కుమార్తో పాటు స్టూడియో గ్రీన్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది. సందీప్కిషన్ జోరు చూస్తుంటే తమిళ్ ఇండస్ట్రీలోనే హీరోగా సెటిల్ అయ్యేలా ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement