నాకు కొత్త డ్రస్సు వచ్చిందోచ్!! | samantha tweets pics with newly designed dress | Sakshi
Sakshi News home page

నాకు కొత్త డ్రస్సు వచ్చిందోచ్!!

Nov 22 2014 4:10 PM | Updated on Aug 28 2018 5:11 PM

నాకు కొత్త డ్రస్సు వచ్చిందోచ్!! - Sakshi

నాకు కొత్త డ్రస్సు వచ్చిందోచ్!!

కొత్తగా డిజైన్ చేయించుకున్న దుస్తులు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు తెగ నచ్చేశాయి.

ఎవరికైనా కూడా కొత్త బట్టలు వచ్చాయంటే సంతోషమే కదూ. హీరోయిన్లు కూడా ఇందుకు అతీతులేం కారు. ఇలా కొత్తగా డిజైన్ చేయించుకున్న దుస్తులు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు తెగ నచ్చేశాయి. వెంటనే ఆ డ్రస్సు వేసుకుని ఫొటోషూట్ చేయించేసుకుంది.

దాంతోపాటు ట్విట్టర్లోనూ ఆ ఫొటోలు షేర్ చేసేసింది. ఇంత అద్భుతమైన డ్రస్ డిజైన్ చేసిందంటూ క్రెషాబజాజ్కి చాలా చాలా థాంక్స్ చెప్పేసింది. ఈ అమ్మాయికి ఎంత చెప్పినా తక్కువేనంటూ.. లవ్యూ బేబ్ అని చెప్పింది. నలుపు, తెలుపు కాంబినేషన్లో ఉన్న ఈ గౌనులో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు తీయించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement