అదొక్కటే చాలదు! | Samantha Tamil film Mershal is coming on wedding time | Sakshi
Sakshi News home page

అదొక్కటే చాలదు!

Sep 25 2017 4:21 AM | Updated on Jul 15 2019 9:21 PM

Samantha Tamil film Mershal is coming on wedding time - Sakshi

తమిళసినిమా: నటి సమంతకు పెళ్లి కళ వచ్చేసింది. అక్టోబర్‌ ఆరో తేదీన కోరుకున్న ప్రియుడు (నాగచైతన్య)ను పెళ్లాడబోతున్నారు. అందుకు తనను తాను తయారు చేసుకుంటున్న ఈ చెన్నై చిన్నది క్రిష్టియన్‌ మత సంప్రదాయం ప్రకారం ఒక సారి, ప్రియుడి మతం హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి అంటూ రెండుసార్లు పెళ్లి, ముచ్చటగా మూడోసారి వివాహ రిసెప్షన్‌ అంటూ మూడు సార్లు ముస్తాబవడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే తన పెళ్లికి స్పెషల్‌ దుస్తులు సిద్ధం చేసుకున్న సమంత మరో పక్క తను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసే పనిలో బీజీగా ఉన్నారు.

విశేషం ఏమిటంటే తన పెళ్లి తరుణంలో తనకు కాబోయే మామగారు నాగార్జునతో కలిసి రాజుగారి గది–2 చిత్రంలో నటించడం. అదే విధంగా తాను విజయ్‌తో కలిసి నటించిన తమిళ చిత్రం మెర్శల్‌ తన పెళ్లి సందర్భంలోనే తెరపైకి రానుంది. ఇకపోతే ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే సమంత తానేమంత అందగత్తెను కాదని బహిరంగంగానే చెబుతుంటారు. తాజాగా ఈ బ్యూటీ తన సౌందర్య రహస్యం గురించి చెబుతూ నిజానికి తాను అందంగా ఉండాలని మాత్రమే కోరుకోనన్నారు. అందంతో పాటు స్ట్రాంగ్‌గా ఉండాలని కోరుకుంటానన్నారు.

అందుకోసమే సిలంబాట్టం(విలువిద్య) నేర్చుకున్నానని నిత్యం ప్రాక్టీస్‌ చేస్తున్నానని చెప్పారు. ఇక వేకువజామునే షూటింగ్‌ ఉన్నా అంతకు ముందే జిమ్‌కు వెళ్లి ఆ రోజు చేయాల్సిన కసరత్తులు ముగిస్తానన్నారు. ఆకలితో ఉండడం, ఉపవాసాలు చేయడం వంటివి తనకు అలవా టు లేదన్నారు. ప్రొటీనులు ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకుంటానని, ఫ్రెష్‌ జ్యూస్, కొబ్బరి నీళ్లు తరచూ తాగుతానని చెప్పారు. పోషకాహారాలే మేనును మిలమిల మెరిసేలా చేస్తాయని సమంత పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement