స్టార్ హీరోల నుంచే నేర్చుకున్నా | Samantha Ruth Prabhu to Join Naga Chaithanya | Sakshi
Sakshi News home page

స్టార్ హీరోల నుంచే నేర్చుకున్నా

May 30 2015 2:58 AM | Updated on Apr 3 2019 9:14 PM

స్టార్ హీరోల నుంచే నేర్చుకున్నా - Sakshi

స్టార్ హీరోల నుంచే నేర్చుకున్నా

సినిమా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను మాత్రమే ఇస్తుంది. అది తనను నమ్ముకునే వారికి చాలానే...

సినిమా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను మాత్రమే ఇస్తుంది. అది తనను నమ్ముకునే వారికి చాలానే అందిస్తుంది. డబ్బు, కీర్తి సంఘంలో గౌరవం ఇలా చాలానే ఇస్తుంది. కాకపోతే కాస్త అదృష్టం, మరి కాస్త కృషి అవసరం అవుతుంది. ఆ తరువాత వారు ఏది చెప్పినా, చేసినా వింతలు, విశేషాలే. అలా మొన్నటి వరకు తమిళంలో విజయం కోసం ఆరాటపడిన నటి సమంత కత్తి చిత్రంతో దాన్ని చేజిక్కించుకున్నారు. అంతకుముందే టాలీవుడ్‌లో పలు విజయాలను మూటకట్టుకున్నారన్నది వేరే విషయం.

తమిళంలో మాత్రం ఈ చెన్నై చిన్నదాన్ని టాప్‌లో నిలబెట్టింది కత్తి చిత్రమే. ప్రస్తుతం టాప్‌స్టార్స్ విజయ్, విక్రమ్, ధనుష్‌లతో నటిస్తూ మంచి జోష్‌లో ఉన్న సమంతకు సినిమాల్లోకి రాకముందు డాన్స్ రాదట. చదువుకునే రోజుల్లో పాఠశాల కార్యక్రమాల్లో ఉపాధ్యాయుల పాట పాడమన్నా సిగ్గుతో పాడేదాన్ని కాదన్నారు. అసలు నలుగురు చేరిన చోట వెళ్లేదాన్నే కాదని చెప్పారు.

అలాంటి తాను సినిమాలోకి వచ్చిన తరువాత స్టార్ హీరోల ద్వారానే డాన్స్ నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు షూటింగ్ స్పాట్‌లో ఎంతమంది మధ్యనైనా డాన్స్ చేయడానికి రెడీ అని ఈ భామ అన్నారు. తన సినీ జీవితం మధ్యలో కాస్త బ్రేక్ అయినా ప్రస్తుతం బాగానే సాగుతోందని సమంత అంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement