
దుమ్మురేపుతోన్న 'సుల్తాన్' ట్రైలర్
సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది..
'Wrestling is not a sport. Its about fighting what lies within' అంటూ తన తాజా చిత్రం 'సుల్తాన్' తో దూసుకొస్తున్నాడు బాలీవుడ్ 'బాక్సాఫీస్ కిల్లర్' సల్మాన్ ఖాన్. ఈద్ ను పురస్కరించుకుని జులై 6న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా ట్రైలర్ మంగళవారం విడుదలైంది. అయి, సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. రిలీజ్ అయిన ఏడు గంటల్లోనే 'సుల్తాన్' ట్రైలర్ కు దాదాపు ఏడు లక్షల హిట్లు వచ్చాయి. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉందికాబట్టి అత్యధిక హిట్లు సాధించే ట్రైలర్ గా రికార్డుకొట్టే అవకాశమూ ఉంది.
సుల్తాన్.. హరియాణాకు చెందిన ఓ రెజ్లర్ నిజజీవితగాథ. ప్రతిష్టాత్మక యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో సుల్తాన్ అలీ ఖాన్ గా 'కండల' విశ్వరూపాన్ని ప్రదర్శించాడు సల్మాన్ ఖాన్(ట్రైలర్ ను బట్టి). తొలిసారిగా అనుష్క శర్మ సల్లూతో జోడీకడుతోంది. రణదీప్ హుడా, అమిత్ సాథ్ ఇతర ముఖ్యనటులు. సంగీతం విశాల్ శేఖర్.