పాక్‌ గాయకుడిని తీసేసిన సల్మాన్‌ | Salman Khan Removes Pakistani Singer From Notebook | Sakshi
Sakshi News home page

పాక్‌ గాయకుడిని తీసేసిన సల్మాన్‌

Feb 19 2019 1:01 PM | Updated on Feb 19 2019 3:40 PM

Salman Khan Removes Pakistani Singer From Notebook - Sakshi

పుల్వామాలో భారత సైనికులపై దాడిని దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తోంది. సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందిస్తున్నారు.  ముఖ్యంగా బాలీవుడ్ సినీ ప్రముఖులు పాక్‌ కళాకారులతో కలిసి పని చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాడు.

 తాజాగా సల్మాన్‌ ఖాన్‌ తన సొం‍త బ్యానర్‌లో తెరకెక్కుతున్న నోట్‌బుక్‌ సినిమా నుంచి పాక్‌ సింగర్‌ అతీఫ్‌ అస్లామ్‌ను తొలగించాడు. ఆ పాటను తానే స్వయంగా పాడాలని నిర్ణయించుకున్నాడు సల్మాన్‌. అంతేకాదు మరో బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ కూడా తన తాజా చిత్రం ‘టోటల్‌ ధమాల్‌’ను పాకిస్తాన్‌లో రిలీజ్ చేయనని ప్రకటించారు.

         పాకిస్తానీ గాయకుడు అతీఫ్‌ అస్లామ్‌ 

Advertisement
 
Advertisement
Advertisement