సల్మాన్‌ అభిమానులకు ఉద్యోగాలు! | Salman Khan offers jobs to fans through Being Human’s job portal | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ అభిమానులకు ఉద్యోగాలు!

Jun 26 2014 11:25 PM | Updated on Sep 2 2017 9:26 AM

సల్మాన్‌ అభిమానులకు ఉద్యోగాలు!

సల్మాన్‌ అభిమానులకు ఉద్యోగాలు!

కండలవీరుడు సల్మాన్‌ఖాన్ గుండె బండరాయి అని చాలామంది అనుకుంటారు. కానీ, ఆయన తెరవెనుక చేపట్టే సేవా కార్యక్రమాల గురించి వింటే మాత్రం ఎవ్వరూ ఆ మాట అనరు,

కండలవీరుడు సల్మాన్‌ఖాన్ గుండె బండరాయి అని చాలామంది అనుకుంటారు. కానీ, ఆయన తెరవెనుక చేపట్టే సేవా కార్యక్రమాల గురించి వింటే మాత్రం ఎవ్వరూ ఆ మాట అనరు, ‘బీయింగ్ హ్యూమన్’ అనే సంస్థ ఆరంభించి, పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు సల్మాన్. ఇప్పటివరకు ఎంతోమందిని ఆదుకున్న సల్మాన్ ఇప్పుడు ప్రత్యేకంగా తన అభిమానుల కోసం ఏదైనా చేయాలనుకున్నారు. అన్ని దానాల్లోకెల్లా విద్యా దానం గొప్పదంటారు. సల్మాన్ ఆల్రెడీ చాలామందికి ఆ దానం చేస్తున్నారు.
 
 అది మాత్రమే కాదు.. ఉన్నత చదువులు చదువుకుని నిరుద్యోగులుగా మిగిలిపోయిన తన అభిమానుల కోసం ఉద్యోగ ప్రాప్తిరస్తు పథకం మొదలుపెట్టారు. దీనికోసం ఓ జాబ్ పోర్టల్ ఆరంభించారు. సల్మాన్ పేరున్న స్టార్ కాబట్టి, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలవారితో సత్సంబంధాలుంటాయి. వారి కంపెనీలో ఉన్న ఖాళీలను తన అభిమానులతో భర్తీ చేయమని కోరారట సల్మాన్. అభిమాన నాయకుడు తమ కోసం ఇలా చేయడం అభిమానులను సంతోషపెడుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బహుశా ఇప్పటివరకూ ఏ హీరో కూడా ఇలాంటి ఓ పథకం ప్రవేశపెట్టి ఉండరేమో.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement