క‌రోనా: లాక్‌డౌన్‌లో స‌ల్మాన్ ఏం చేస్తున్నాడో తెలుసా!

Salman Khan Moved Farmhouse With Family Members During Lockdown - Sakshi

ముంబై : యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైరస్‌ను త‌రిమి కొట్టేందుకు అన్ని దేశాలు నివార‌ణ చ‌ర్య‌లను పటిష్టంగా అమలు చేస్తున్నాయి.. లాక్ డౌన్ విధించి ఎక్క‌డి ప్ర‌జ‌ల‌ను అక్క‌డే నిలిపి వేశారు. ఈ నేప‌థ్యంలో సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఇంట్లోనే ఉంటున్నారు. సెల్ఫ్ ఐసోలేష‌న్ పాటిస్తూ.. త‌మ‌కు న‌చ్చిన అల‌వాట్ల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు. అయితే తాము ఆరాధించే తార‌లు ఏం చేస్తున్నారో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి అంద‌రికీ ఉంటుంది. అందుకే సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు చేరువ‌గా ఉంటున్నారు. అలాగే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

కాగా బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న తాజా చిత్రం రాధే షూటింగ్.. ఈ నెల చివ‌రి వ‌ర‌కు జ‌ర‌గాల్సి ఉంది. అయితే దేశంలో క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో రాధే షూటింగ్ వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో స‌ల్మాన్ కుటుంబంతో క‌లిసి తాను ఎక్కువగా ఇష్ట‌ప‌డే ఫామ్‌హౌజ్‌కు మ‌కాం మార్చాడు. సోద‌రి అర్పితా ఖాన్‌, ఆమె భ‌ర్త ఆయుష్ శ‌ర్మ‌, అల్లుడు అహిల్‌, మేన‌కోడ‌లు అయాత్‌తో క‌లిసి ప‌న్వెల్‌లోని ఫామ్‌హౌజ్‌లో స‌రదాగా గ‌డుపుతున్నారు. అయితే ఆ ఫామ్ హౌజ్‌లో అన్ని సౌక‌ర్యాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా స‌ల్మాన్ ఆ ఫామ్‌హౌజ్‌లో త‌న పుట్టిన రోజులు వేడుక‌లు జ‌రుపుకుంటాడు. ఇటీవ‌లే  స‌ల్మాన్ అల్లుడు అహిల్‌తో క‌లిసి ఆ ఫామ్ హౌజ్‌లో తిరుగుతున్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నాడు.

ఇక కరోనా దెబ్బకు బాలీవుడ్ సినిమాలు వాయిదా పడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే అక్షయ్‌కుమార్‌ ‘సూర్యవన్షీ’, రణ్‌వీర్‌సింగ్‌ ‘83’ వంటి సినిమాల విడుదల వాయిదా ప‌డ‌గా.. ఈ రంజాన్ పండక్కి విడుదల కావాల్సిన సల్మాన్ ఖాన్ ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ సినిమా రిలీజ్‌ కూడా వాయిదా పడుతుందనే వార్తలు బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top