బుల్‌ బుల్‌ మ్యారేజ్‌ హాల్‌ | Kriti Kharbanda And Pulkit Samrat To Play Couple In Salman Film | Sakshi
Sakshi News home page

బుల్‌ బుల్‌ మ్యారేజ్‌ హాల్‌

May 4 2020 5:09 AM | Updated on May 4 2020 5:09 AM

Kriti Kharbanda And Pulkit Samrat To Play Couple In Salman Film - Sakshi

కృతీ కర్భందా

హీరోయిన్‌ కృతీ కర్భందా రీల్‌ మ్యారేజ్‌ లాక్‌డౌన్‌ వల్ల వాయిదా పడింది. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ నిర్మాతగా ‘బుల్‌ బుల్‌ మ్యారేజ్‌ హాల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా రూపొందనుంది. రోహిత్‌ నాయర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఇందులో పుల్‌కిత్‌ సామ్రాట్, కృతీ కర్భందా, సునీల్‌ గ్రోవర్, దేశీ షా ముఖ్యతారలు. లక్నో బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం భారతీయ వివాహ వ్యవస్థలోని అంశాల ఆధారంగా తెరకెక్కనుంది. ఏప్రిల్‌లో మొదలుకావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్‌ వల్ల ఆగిపోయింది. ఇలా కృతీ రీల్‌ మ్యారేజ్‌ వాయిదా పడింది. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా ‘డ్రీమ్‌గర్ల్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్‌ ఈ సినిమాకు డైలాగ్స్‌ అందించనుండటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement