'అత్యంత అందమైన వీడియో ఇది' | Salman Khan Mother Salma Dance To Silas Cheap Thrills | Sakshi
Sakshi News home page

'అత్యంత అందమైన వీడియో ఇది'

Jul 23 2019 3:13 PM | Updated on Jul 23 2019 4:47 PM

Salman Khan Mother Salma Dance To Silas Cheap Thrills - Sakshi

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ సందడి చేస్తూంటాడు.. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌. సరదాగా పిల్లలతో ఆడుకునే వీడియోను, జిమ్‌లో కసరత్తు చేస్తూ ఉండే సరదా వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా భాయిజాన్‌ తల్లి సల్మాతో కలిసి డ్యాస్‌ చేసిన వీడియోను పోస్ట్‌ చేశాడు. తల్లి సల్మా చేతులను తన చేతుల్లోకి తీసుకుని సరదా స్టేప్‌లు వేస్తూంటే సల్మా వాటిని ఆస్వాదిస్తూ కొడుకును అనుసరిస్తున్న ఇన్‌స్టా వీడియో  సోషల్‌ మీడియాలో  వైరల్‌ అవుతోంది. అలాగే మరో బాలీవుడ్‌  హీరో హృతిక్‌ రోషన్‌ కూడా భాయిజాన్‌ బాట పట్టారు. తల్లితో కలిసి జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. ఇప్పుడు ఆ వీడియో  కూడా సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తుంది.

'మామ్‌ సేయింగ్‌ బంద్‌ ఖరో యో నాచ్‌ గానా'(అమ్మ.. ఇంకా ఆట పాట ఆపమంటుంది) అంటూ పోస్ట్‌ చేసిన వీడియోకి లక్షా ముప్పై వేలకు పైగా లైకులు వచ్చాయి. డ్యాన్స్‌ చివరల్లో తల్లిని ఆత్మీయంగా హత్తుకున్న ఈ వీడియోను చూసిన బాలీవుడ్‌ హీరో 'వరుణ్‌ ధావన్‌ హార్ట్‌ ఎమోజీల వర్షం కురిపించాడు'. అలాగే అభిమానులంతా ఈ తల్లీ, కొడుకుల ప్రేమను చూసి 'మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌',  'అత్యంత అందమైన వీడియో ఇది',  'ఓ స్టార్‌ హీరో అతని తల్లీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా ముద్దుగా ఉంది'. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement