కన్నడంలో ఖాన్‌ డైలాగ్స్‌ | Salman Khan to dub the dialogues for Dabangg 3 in Kannada language | Sakshi
Sakshi News home page

కన్నడంలో ఖాన్‌ డైలాగ్స్‌

Oct 18 2019 2:36 AM | Updated on Oct 18 2019 2:36 AM

Salman Khan to dub the dialogues for Dabangg 3 in Kannada language - Sakshi

ఇప్పటివరకు సల్మాన్‌ ఖాన్‌ పంచ్‌ డైలాగ్స్‌ ఎక్కువగా హిందీలోనే విన్నాం. త్వరలో కన్నడంలోనూ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ చెప్పడానికి సల్మాన్‌ సిద్ధమవుతున్నారని తెలిసింది. సల్మాన్‌ ఖాన్‌ తాజా చిత్రం ‘దబాంగ్‌ 3’. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకుడు. కన్నడ నటుడు సుదీప్‌ విలన్‌గా నటించారు. కన్నడంలో సల్మాన్‌ పాత్రకు సల్మానే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోనున్నారు. ఇందుకోసం కన్నడ ఉచ్చారణ మీద దృష్టి పెట్టారట సల్మాన్‌. కన్నడంలో సంభాషణలు సరిగ్గా పలికేందుకు సల్మాన్‌కు సుదీప్‌ సహాయం చేస్తున్నారని కూడా తెలిసింది. డిసెంబర్‌ 20న  ‘దబాంగ్‌ 3’ రిలీజ్‌ కానుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement