సల్మాన్‌తో వెంకీ చిందులు.. వైరల్‌ వీడియో | Salman Khan Dance At Venkatesh Daughters Marriage | Sakshi
Sakshi News home page

సల్మాన్‌తో వెంకీ చిందులు.. వైరల్‌ వీడియో

Mar 26 2019 9:22 AM | Updated on Mar 26 2019 1:26 PM

Salman Khan Dance At Venkatesh Daughters Marriage - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ హీరో వెంకటేష్‌ కూతురు ఆశ్రిత వివాహం జైపూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌​ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీటన్నింటిలోకి ఒక వీడియో మాత్రం విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. వెంకీ కూతురు వివాహానికి బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా హాజరైన సంగతి తెలిసిందే. పెళ్లికి వచ్చిన సల్మాన్‌.. వెంకీతో కలిసి చిందేశారు. వీరితో పాటు రానా కూడా చేరి మరింత సందడి చేశారు. తన ‘కిక్‌’ సినిమాలోని జుమ్మే కీ రాత్‌ పాటకు వెంకీ, రానాలతో కలిసి సల్మాన్‌ డ్యాన్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత, హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిల వివాహం ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని జయపురలో జరిగిన ఈ శుభకార్యానికి సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. వెంకటేశ్‌ స్నేహితుడు సల్మాన్‌ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement