కత్రినాపై సల్మాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు | Salman Khan calls Katrina Kaif his baby | Sakshi
Sakshi News home page

కత్రినాపై సల్మాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Jul 8 2018 8:50 PM | Updated on Jul 8 2018 8:50 PM

Salman Khan calls Katrina Kaif his baby - Sakshi

సాక్షి, ముంబయి : మాజీ లవర్‌ కత్రినా కైఫ్‌తో తన అనుబంధం ఎలాంటిదో మరోసారి గుర్తు చేశాడు బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌. మాజీ ప్రేమికులు మంచి స్నేహితులేనని నిరూపించేలా దబాంగ్‌ సిరీస్‌ టూర్‌లో భాగంగా అమెరికాలో ఖాన్‌ భాయ్‌ కత్రినాతో సన్నిహితంగా వ్యవహరించాడు. కత్రినాను తన బేబీగా పిలిచిన సల్మాన్‌ వీడియో ఇంటర్‌నెట్‌లో క్షణాల్లో వైరల్‌గా మారింది.

మీడియా సమావేశంలో కత్రినాను ఉద్దేశించి తన బేబీ బర్త్‌డే ఈనెల 16న అంటూ చమత్కరించి అందరినీ ఉత్కంఠకు లోను చేశాడు. బాలీవుడ్‌ మన్మధుడు రణ్‌బీర్‌ కపూర్‌తో డేటింగ్‌కు ముందు కత్రినా సల్మాన్‌ ఖాన్‌తో సన్నిహితంగా మెలిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి అనుబంధంపై బాలీవుడ్‌లో భారీ ప్రచారమే సాగింది. టైగర్‌ జిందా హై మూవీతో కత్రినా, సల్మాన్‌ అనుబంధంపై బాలీవుడ్‌లో మరోసారి హాట్‌ డిబేట్‌ నడిచింది. 

Advertisement
 
Advertisement
Advertisement