మాజీ ప్రేయసి చూసేలా కొత్త గర్ల్ఫ్రెండ్తో..! | Salman Khan attended Baba Siddique's Iftar party last night | Sakshi
Sakshi News home page

మాజీ ప్రేయసి చూసేలా కొత్త గర్ల్ఫ్రెండ్తో..!

Jun 20 2016 8:12 AM | Updated on Sep 4 2017 2:57 AM

మాజీ ప్రేయసి చూసేలా కొత్త గర్ల్ఫ్రెండ్తో..!

మాజీ ప్రేయసి చూసేలా కొత్త గర్ల్ఫ్రెండ్తో..!

మాజీ ప్రేమికులు ఒక్కచోట కలిశారు. బాలీవుడ్లో టాప్ మోస్ట్ చర్చించుకునే కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన ఒకప్పటి ప్రేయసి కత్రినా కైఫ్ మరోసారి ఒకరికొకరు ఎదురయ్యారు.

ముంబయి: మాజీ ప్రేమికులు ఒక్కచోట కలిశారు. బాలీవుడ్లో టాప్ మోస్ట్ చర్చించుకునే కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన ఒకప్పటి ప్రేయసి కత్రినా కైఫ్ మరోసారి ఒకరికొకరు ఎదురయ్యారు. వారిద్దరు కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. ఆదివారం రాత్రి రాజకీయ నేత బాబా సిద్దిఖీ బాంద్రాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఇచ్చిన విందుకు హాజరయ్యారు.

అంతేకాదు సల్మాన్ ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్గా భావిస్తున్న లులియా వాంటుర్ కూడా ఈ విందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు, బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్, ఎమీ జాక్సన్, గోల్డీ బెల్ ఇతర బాలీవుడ్ వర్గం కూడా ఇఫ్తార్ విందుకు హాజరయినట్లు తెలుస్తోంది. అయితే, లులియా ఈ విందుకు నిజంగానే వెళ్లిందా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. సల్మాన్ సోదరి అర్పితాఖాన్ శర్మ, ఆమె భర్త ఆయుష్ శర్మ, వాళ్ల కుమారుడు అహిల్ కూడా ఈ విందులో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement