చిరంజీవిగారి లుక్‌ కనిపిస్తోంది | Sakala Kala Vallabhudu Movie teaser Release | Sakshi
Sakshi News home page

చిరంజీవిగారి లుక్‌ కనిపిస్తోంది

Oct 9 2018 4:44 AM | Updated on Oct 9 2018 4:44 AM

Sakala Kala Vallabhudu Movie teaser Release - Sakshi

తనిష్క్‌రెడ్డి, మేఘనా గుప్తా

‘‘యువతకు కనెక్ట్‌ అయ్యే చిత్రం ‘సకల కళా వల్లభుడు’. తనిష్క్‌ మంచి నటుడే కాదు.. అతనిలో చాలా కళలు ఉన్నాయి. ఈ సినిమా చూస్తే ఆ విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది. అతని లుక్‌ చూస్తే ‘స్టేట్‌రౌడీ’ సినిమాలో చిరంజీవిగారి లుక్‌లా అనిపిస్తోంది. ఈ చిత్రంలో నేను బాబా పాత్రలో ప్రేక్షకులను నవ్విస్తాను’’ అని నటుడు పృథ్వీ అన్నారు. తనిష్క్‌రెడ్డి, మేఘనా గుప్తా జంటగా శివగణేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సకల కళా వల్లభుడు’. దీపాల ఆర్ట్స్‌ సమర్పణలో అనిల్, త్రినాథ్, కిషోర్, శ్రీకాంత్‌ నిర్మించిన  ఈ సినిమా టీజర్‌ను పృథ్వీ విడుదల చేశారు. నిర్మాతలు అనిల్, శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘శివ గణేష్‌ మాకు మంచి మిత్రుడు. మమ్మల్ని భరించి సినిమాని పూర్తి చేశాడు.

ఈ సినిమా విడుదల అనంతరం ‘బుర్రకథ’ అనే చిత్రంతో రానున్నాం. మా సింహ ఫిలిమ్స్‌ పతాకంపై ఏడాదికి రెండు సినిమాలు వస్తాయి’’ అన్నారు. ‘‘యాక్షన్‌ కామెడీ జానర్‌లో తెరకెక్కిన చిత్రమిది. పృథ్వీగారి కామెడీ ఈ చిత్రానికి హైలైట్‌. తనిష్క్‌ రెడ్డి మంచి నటన కనబర్చారు. ఈ నెలాఖరులో లేదా నవంబర్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అని శివగణేష్‌ అన్నారు. ‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ యాక్షన్‌ మూవీ ఇది. ఇందులో  చిరంజీవిగారి పోస్టర్స్, పవన్‌ కల్యాణ్‌గారి హెయిర్‌ స్టయిల్, అల్లు అర్జున్‌గారి సాంగ్‌ ఉంటుంది’’ అన్నారు తనిష్క్‌ రెడ్డి. జీవా, పృథ్వీ, సుమన్, చిన్నా, శృతి, అపూర్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి చరణ్, సంగీతం: అజయ్‌ పట్నాయక్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement