ఆటోడ్రైవర్‌

Sai Pallavi to play an auto driver in Dhanush Maari 2? - Sakshi

సాయి పల్లవికి కారు నడపడం బాగా వచ్చు. ‘ఫిదా’ సినిమాలో వరుణ్‌ తేజ్‌ని రైల్వే స్టేషన్‌ నుంచి పికప్‌ చేసుకుని, రయ్‌మని కారులో తీసుకెళ్లే సీన్‌ గుర్తు చేసుకోండి. అదే సినిమాలో ఈ బ్యూటీ ధైర్యంగా ట్రాక్టర్‌ నడిపారు. అదే సినిమాలో స్కూటీని కూడా సునాయాసంగా నడిపారు. ఇప్పుడు తమిళ చిత్రం ‘మారీ 2’ కోసం ఆటో నడుపుతున్నారు. ఈ సినిమాలో ఆమె ఆటో డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఆల్రెడీ ఆటో ఎలా నడపాలో ట్రైనింగ్‌ కూడా తీసుకున్నారు. ధనుష్‌ హీరోగా బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మారీ’కి సీక్వెల్‌ ఇది.

ఫస్ట్‌ పార్ట్‌లో కాజల్‌ కథానాయికగా నటించగా, రెండో పార్ట్‌లో సాయి పల్లవిని తీసుకున్నారు. ఏ పాత్ర అయినా ఈజీగా చేసేసే సాయి పల్లవి ఆటో డ్రైవర్‌గా మెప్పిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా æశర్వానంద్‌ హీరోగా రూపొందుతున్న ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలోనూ,  సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న ‘ఎన్‌జీకె’ చిత్రంలోనూ సాయి పల్లవి నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top