భగవద్గీత సాక్షిగా..! | Sai Dharam Tej Next Movie Title As BhagavadGita Sakshiga | Sakshi
Sakshi News home page

భగవద్గీత సాక్షిగా..!

Jul 18 2020 6:04 AM | Updated on Jul 18 2020 6:04 AM

Sai Dharam Tej Next Movie Title As BhagavadGita Sakshiga

వెండితెరపై ‘భగవద్గీత సాక్షిగా’ ప్రమాణం చేసి ఏదో నిజాన్ని చెప్పాలనుకుంటున్నారట సాయిధరమ్‌ తేజ్‌. ఇందుకు తగ్గ సన్నాహాలు మొదలైపోయాయని ఫిల్మ్‌నగర్‌ లేటెస్ట్‌ టాక్‌. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా గోపాల్‌ అనే ఓ కొత్త దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి ‘భగవద్గీత సాక్షిగా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట చిత్రబృందం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది.  ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ఈ సంగతి ఇలా ఉంచితే... ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు సాయిధరమ్‌ తేజ్‌. అలాగే దేవ కట్టా డైరెక్ట్‌ చేయనున్న సినిమాలో కూడా హీరోగా నటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement