పేదోడికి ప్లాట్‌ ఫాం.. ధర్మాభాయ్‌.కామ్‌ | Sai Dharam Tej Inttelligent Teaser | Sakshi
Sakshi News home page

Jan 27 2018 3:48 PM | Updated on Jan 27 2018 3:53 PM

Sai Dharam Tej Inttelligent Teaser - Sakshi

వరుస ఫ్లాప్‌ లతో ఇబ్బందుల్లో ఉన్న మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ హీరోగా.. స్టార్ డైరెక్టర్‌ వివి వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్‌ మూవీ ఇంటిలిజెంట్‌. సాయి ధరమ్‌ ధర్మభాయ్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌ గా నటిస్తుండగా సికె ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై సి.కళ్యాణ్‌ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 9న రిలీజ్‌ కు రెడీ అవుతున్న ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌.

ఇప్పటికే ఇంట్రస్టింగ్‌ పోస్టర్‌లతో ఆకట్టుకున్న ఇంటిలిజెంట్‌ యూనిట్‌, తాజాగా టీజర్‌ను రిలీజ్ చేసింది. సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఈ టీజర్‌ ను రిలీజ్ చేశారు. సుప్రీం హీరోని తన మార్క్ మాస్‌ లుక్ లో చూపించాడు వినాయక్‌. టీజర్‌ లోనే సినిమా పక్కా మాస్‌ యాక్షన్‌ అని కన్ఫామ్ చేశారు. టీజర్ మొత్తం సాయి ధరమ్ తేజ్‌ క్యారెక్టర్‌ ను ప్రజెంట్ చేసేందుకే కేటాయించారు. స్టైలిష్‌ లుక్‌ లో రాహుల్‌ దేవ్‌ లోను కొన్ని క్షణాలు పాటు చూపించగా హీరోయిన్‌ను అసలు పరిచయం చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement