తప్పు కాదు కావాలనే అలా..! | Sai Dharam tej Intelligent Title Is Spelled Wrong | Sakshi
Sakshi News home page

Jan 22 2018 3:24 PM | Updated on Jan 22 2018 3:24 PM

Sai Dharam tej Intelligent Title Is Spelled Wrong - Sakshi

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్‌ మూవీ ఇంటిలిజెంట్‌. స్టార్ డైరెక్టర్‌ వివి వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఇప్పటికే టైటిల్‌ లోగో రిలీజ్ చేయగా ఈ రోజు (సోమవారం) సాయంత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ ను రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈసినిమా టైటిల్‌ లోగోలో ఇంటిలిజెంట్‌ పదం ఇంగ్లీష్‌లో స్పెల్లింగును మార్చి రాశారు. ‘INTELLIGENT’ స్పెల్లింగ్‌ ను ‘INTTELLIGENT’గా రాశారు. దీంతో పోస్టర్‌ లో తప్పు వచ్చిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. ఈ విషయంపై బిఏరాజు క్లారిటీ ఇచ్చారు. న్యూమరాలజీ కరెక్షన్‌ కారణంగానే స్పెల్లింగ్‌ ను మార్చి రాశారని తెలిపారు. వరుస ఫ్లాప్‌ లతో కష్టాల్లో ఉన్న సాయి ధరమ్‌ కెరీర్ ను గాడిలో పెట్టే బాధ్యత తీసుకున్న వినాయక్‌ సినిమాను సక్సెస్‌ చేసేందుకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement