గెస్ట్ పోలీసాఫీసర్! | sai dharam tej guest role in nakshatram | Sakshi
Sakshi News home page

గెస్ట్ పోలీసాఫీసర్!

Aug 7 2016 11:59 PM | Updated on Sep 27 2018 8:48 PM

గెస్ట్ పోలీసాఫీసర్! - Sakshi

గెస్ట్ పోలీసాఫీసర్!

‘సుప్రీమ్’లో లేడీ పోలీసాఫీసర్‌తో ప్రేమలో పడిన యువకుడిగా సాయిధరమ్ తేజ్ నటించారు. ఆ సినిమాలో హీరోయిన్‌ని ప్రేమలో...

‘సుప్రీమ్’లో లేడీ పోలీసాఫీసర్‌తో ప్రేమలో పడిన యువకుడిగా సాయిధరమ్ తేజ్ నటించారు. ఆ సినిమాలో హీరోయిన్‌ని ప్రేమలో పడేయడానికి సరదాగా ఓసారి ఖాకీ చొక్కా వేసుకున్నారు. ఇప్పుడు మాత్రం నిజమైన పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్, కాజల్ అగర్వాల్, రెజీనా నటీనటులుగా రూపొందుతున్న సినిమా ‘నక్షత్రం’. ఇందులో సాయిధరమ్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఇది గెస్ట్ రోల్ అనమాట. త్వరలో షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఆదివారం దర్శకుడు కృష్ణవంశీ ఈ విషయం తెలియజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement