రికార్డులు సృష్టిస్తున్న సాహో.. ఆ ఒక్కటి మాత్రం

Saaho Box Office Day 2 Collections - Sakshi

మూడు సంవత్సరాల నిరీక్షణ అనంతరం డార్లింగ్‌ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు సాహో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. ఇక బాహుబలి ఎంటర్‌ అయ్యాడంటే వార్‌ వన్‌సైడే అంటూ రెబల్‌ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. పూనకం వచ్చినట్టుగా థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. ఒకవైపేమో సాహో ఆశించిన స్థాయిలో లేదని కొందరు పెదవి విరుస్తుంటే.. మరోవైపేమో ఇండియన్‌ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిందని మరి కొందరు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదలైన ఈ చిత్రం రికార్డుల పరంగా చక్రం తిప్పుతోంది. 

హిందీలో రూ.25 కోట్లకు పైగా షేర్‌ సాధించి ఈ ఏడాది భారీ ఓపెనింగ్స్‌ సాధించిన మూడో చిత్రంగా సాహో నిలిచింది. అయితే సాహోతో ప్రభాస్‌ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా బాహుబలితో తనపేరిట ఉన్న రికార్డును మాత్రం టచ్‌ చేయలేకపోయారు. విడుదలైన తొలినాడే రూ.121 కోట్లు వసూలు చేసిన బాహుబలి-2 రికార్డును ఈ సినిమా అధిగమించలేకపోయింది. తొలిరోజు సెంచరీ కొట్టిన సాహో రెండు రోజల్లోనే రూ.200 కోట్ల గ్రాస్‌ను అధిగమించింది.

డివైడ్‌ టాక్‌, తక్కువ రేటింగ్‌ ఇవేవీ సాహో వసూళ్లపై ప్రభావాన్ని చూపించలేకపోయాయి. వరుస సెలవులు ఉండటంతో సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. హాలీవుడ్‌కు ఏమాత్రం తీసిపోని యాక్షన్‌ సన్నివేశాలతో తెరకెక్కిన సాహో మొదటి రోజు కలెక్షన్లతో పలు రికార్డులు మట్టి కొట్టుకుపోయాయి. విడుదలైన తొలిరోజే కలెక్షన్లను కొల్లగొట్టిన హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాల​ అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ రూ.53 కోట్లు, థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌ రూ.52 కోట్లు పేరిట ఉన్న రికార్డుల్ని సాహో దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాయి.

చదవండి: ‘సాహో’ మూవీ రివ్యూ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top