సూర్య అవుట్... డాలీ ఇన్!

సూర్య అవుట్... డాలీ ఇన్! - Sakshi


పవన్ కల్యాణ్ హీరోగా ఎస్.జె. సూర్య దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించనున్న తాజా చిత్రం లాంచనంగా ప్రారంభమై దాదాపు రెండు నెలలు అవుతోంది. ఇంకా ఈ చిత్రం షూటింగ్ మొదలు కాకపోవడంతో కథా చర్చల దశలో ఉందనీ, రేపో మాపో చిత్రీకరణ మొదలుపెట్టేస్తారనే చర్చ జరుగుతోంది. అయితే అసలు విషయం అది కాదని నిర్ధారణ అయ్యింది. చిత్రదర్శకుడు ఎస్.జె. సూర్య డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతోనే షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ విషయాన్ని ఆదివారం చిత్రనిర్మాత శరత్ మరార్ ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు.తమిళంలో ఎస్.జె. సూర్య నటించిన ‘ఇరైవి’ ఇటీవల విడుదలైంది. ఆ చిత్రం తర్వాత సూర్యకు తమిళ, తెలుగు భాషల్లో నటుడిగా పలు అవకాశాలు రావడంతో పవన్ కల్యాణ్‌తో కమిట్ అయిన చిత్రానికి టైమ్ కేటాయించలేని పరిస్థితి. ఈ కారణంగా సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో పవన్ కల్యాణ్‌తో చర్చించి, సూర్య స్థానంలో వేరే దర్శకుణ్ణి తీసుకోవాలని శరత్ మరార్ నిర్ణయించుకున్నారు.సూర్యతో కూడా మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చారట. ఎలాంటి భిన్నాభిప్రాయాలకూ తావు లేకుండా ముగ్గురూ ఒక అవగాహన వచ్చాకే వేరే దర్శకుణ్ణి నిర్ణయించారు. వెంకటేశ్-పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో ‘గోపాల గోపాల’ తెరకెక్కించిన డాలీ (కిశోర్‌కుమార్ పార్థసాని) ని దర్శకుడిగా ఫిక్స్ చేశారు. జూలై నెలాఖరున షూటింగ్ మొదలుపెట్టనున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top