ఇలియానా సినిమాకు బంపర్ వసూళ్లు! | Rustom mints 127 crore rupees in four weeks, says taran adarsh | Sakshi
Sakshi News home page

ఇలియానా సినిమాకు బంపర్ వసూళ్లు!

Sep 10 2016 3:50 PM | Updated on Sep 4 2017 12:58 PM

ఇలియానా సినిమాకు బంపర్ వసూళ్లు!

ఇలియానా సినిమాకు బంపర్ వసూళ్లు!

చాలారోజుల నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న గోవా బ్యూటీ ఇలియానా.. ఎట్టకేలకు బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ మంచి హిట్ సంపాదించింది.

చాలా రోజుల నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న గోవా బ్యూటీ ఇలియానా.. ఎట్టకేలకు బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ మంచి హిట్ సంపాదించింది. తన భర్త అక్షయ్ కుమార్‌కు ద్రోహం చేసి.. తర్వాత మళ్లీ పశ్చాత్తాపంతో అతడి పంచన చేరిన భార్యగా ఆమె, తన శత్రువును చంపేసి కూడా ఆ హత్య కేసు నుంచి తెలివిగా బయటపడిన నేవీ అధికారి పాత్రలో అక్షయ్ కుమార్ నటించిన రుస్తుం సినిమా నాలుగు వారాల్లో 127 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.

ముందునుంచే హిట్ టాక్ సంపాదించుకున్న రుస్తుం సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. మొదటి వారం రూ. 90.90 కోట్లు, రెండోవారం 26.11 కోట్లు, మూడోవారం 7.71 కోట్లు, నాలుగోవారం 2.4 కోట్లతో మొత్తం రూ. 127.13 కోట్ల వసూళ్లను కేవలం భారతదేశ మార్కెట్‌లోనే సాధించిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఇటీవలి కాలంలో మొదటి వారంలోనే అత్యధిక వసూళ్లు వస్తున్నాయన్న విషయాన్ని కూడా ఈ సినిమా మరోసారి నిరూపించింది. మొత్తం వసూళ్లలో సింహభాగం దాదాపు 91 కోట్ల రూపాయలు మొదటివారంలోనే రావడం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement