రుద్రమదేవి నగలు చెన్నైకి? | Rudramadevi jewellery in Chennai | Sakshi
Sakshi News home page

రుద్రమదేవి నగలు చెన్నైకి?

Aug 18 2014 8:11 AM | Updated on Aug 3 2018 3:04 PM

రుద్రమదేవి నగలు చెన్నైకి? - Sakshi

రుద్రమదేవి నగలు చెన్నైకి?

రుద్రమదేవి చిత్రంలో ఆ పాత్ర పోషించిన అనుష్క ధరించిన కోట్లాది రూపాయల బంగారు నగలు చెన్నైకి చేరాయా?

రుద్రమదేవి చిత్రంలో ఆ పాత్ర పోషించిన అనుష్క ధరించిన కోట్లాది రూపాయల బంగారు నగలు చెన్నైకి చేరాయా? ఇలాంటి సందేహం రావడంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. వివరాల్లో కెళితే...నటి అనుష్క నటిస్తున్న భారీ చరిత్రాత్మక కథా చిత్రం రుద్రమదేవి. తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుష్క కాకతీయ రాజ్యపు పట్టపురాణిగా శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. గుణశేఖర్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అనుష్క ఐదుకోట్ల విలువైన బంగారు నగలను ధరించి నటిస్తున్నారు.
 
 ఈ నగలను చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రముఖ నగల దుకాణంలో కొనుగోలు చేశారు. ఈ ఖరీదైన బంగారు నగలు అనూహ్యంగా దొంగతనానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర దర్శక నిర్మాత హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు తీవ్రం చేశారు. పోయిన నగలను చెన్నైలో కొనుగోలు చేసి విమానం ద్వారా హైదరాబాదుకు తీసుకెళ్లారు. కాబట్టి పోలీసులు హైదరాబాదు విమానాశ్రయంలో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చెన్నై నుంచి హైదరాబాదుకు నగలను తీసుకొస్తుండగా వెనుక సందేహించదగ్గ వారెవరైనా ఉన్నారా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
 
 శనివారం హైదరాబాదు పోలీసులు చెన్నైకి వచ్చారు. చెన్నై విమానాశ్రయంలో గల కేంద్ర పోలీసు భద్రతాదళం సాయంతో నగలు తీసుకెళ్లిన రోజు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అనుమానించదగ్గ సన్నివేశాలను సీడీలలో లోడ్ చేసుకుని వెళ్లారు. దీంతో రుద్రమదేవి నగలు చెన్నైకి చేరాయా? అన్న సందేహం కలుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement