మిస్టర్ బీన్‌కు భార్య విడాకులు! | Rowan Atkinson divorced on grounds of his 'unreasonable behaviour' | Sakshi
Sakshi News home page

మిస్టర్ బీన్‌కు భార్య విడాకులు!

Nov 10 2015 10:23 PM | Updated on Sep 28 2018 4:32 PM

మిస్టర్ బీన్‌కు భార్య విడాకులు! - Sakshi

మిస్టర్ బీన్‌కు భార్య విడాకులు!

'వింత ప్రవర్తన' కారణంగా మిస్టర్ బీన్ స్టార్ రోవన్ అట్కిన్‌సన్‌కు ఆయన భార్య విడాకులు ఇచ్చింది. 60 ఏళ్ల అట్కిన్‌సన్‌ గత కొంతకాలంగా తనకన్నా 24 ఏళ్లు చిన్నదైన ఓ కామెడీ నటితో ప్రేమాయణం సాగిస్తూ భార్య సునెట్రాకు దూరంగా ఉంటున్నాడు.

'వింత ప్రవర్తన' కారణంగా మిస్టర్ బీన్ స్టార్ రోవన్ అట్కిన్‌సన్‌కు ఆయన భార్య విడాకులు ఇచ్చింది. 60 ఏళ్ల అట్కిన్‌సన్‌ గత కొంతకాలంగా తనకన్నా 24 ఏళ్లు చిన్నదైన ఓ కామెడీ నటితో ప్రేమాయణం సాగిస్తూ భార్య సునెట్రాకు దూరంగా ఉంటున్నాడు. మేకప్ ఆర్టిస్ట్ అయిన సునెట్రాను 1990లో అట్కిన్‌సన్ వివాహం చేసుకున్నాడు. అయితే గత 18 నెలలుగా 32 ఏళ్ల లూయిస్ ఫోర్డ్‌తో డేటింగ్ చేస్తుండటంతో భార్యను విడిచిపెట్టాడు.

అర్థంలేని కారణాలతో తనకు దూరంగా ఉంటున్న అట్కిన్‌సన్‌ నుంచి తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా సునెట్రా కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో లండన్ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. వింత చేష్టలు చేసే మిస్టర్ బీన్‌ పాత్ర పోషించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అట్కిన్‌సన్ పేరుప్రఖ్యాతలు సంపాదించిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement