పూర్తి భిన్నంగా... | Rough movie release 28th november | Sakshi
Sakshi News home page

పూర్తి భిన్నంగా...

Nov 19 2014 10:54 PM | Updated on Sep 2 2017 4:45 PM

పూర్తి భిన్నంగా...

పూర్తి భిన్నంగా...

ఈ చిత్రకథ వినగానే, మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం కుదిరింది. తొలి కాపీ చూశాక ఆ నమ్మకం రెట్టింపైంది.

‘‘ఈ చిత్రకథ వినగానే, మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం కుదిరింది. తొలి కాపీ చూశాక ఆ నమ్మకం రెట్టింపైంది. ఆది కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలుస్తుంది’’ అని నటుడు సాయికుమార్ చెప్పారు. ఆది, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సీహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘రఫ్’. సుదర్శనరావు మాధవరం సమర్పణలో అభిలాష్ మాధవరం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆది మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది.
 
 ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమాలో లేని ఒక పాటను త్వరలో విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఆది అద్భుతంగా నటించాడనీ, మణిశర్మ, సెంథిల్‌కుమార్, అరుణ్‌కుమార్ వంటి గొప్ప సాంకేతిక నిపుణులు పని చేయడం ఈ చిత్రానికి ప్లస్ అని దర్శకుడు తెలిపారు. సుబ్బారెడ్డిగారు ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారనీ, విజయంపై పూర్తి నమ్మకం ఉందని నిర్మాత అన్నారు. ఆదితో తనకిది మొదటి చిత్రమనీ, ఇందులో మంచి పాత్ర చేశానని కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement