రఫ్ ఆడించే యాక్షన్ | 'Rough' audio on Nov 2nd | Sakshi
Sakshi News home page

రఫ్ ఆడించే యాక్షన్

Oct 29 2014 11:41 PM | Updated on Sep 2 2017 3:34 PM

రఫ్ ఆడించే యాక్షన్

రఫ్ ఆడించే యాక్షన్

ఆది, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రఫ్’. సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకుడు. అభిలాష్ మాధవరం నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న

 ఆది, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రఫ్’. సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకుడు. అభిలాష్ మాధవరం నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఆది నటిస్తున్న పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడులైన టీజర్‌కి మంచి స్పందన లభిస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలందించారు. నవంబర్ 2న పాటల వేడుకను ఘనంగా జరుపనున్నాం’’ అని తెలిపారు. నటునిగా ఆదిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే ఈ సినిమా... అతని కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలుస్తుందని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి మాటలు: మరుధూరి రాజా, కెమెరా: సెంథిల్ కుమార్, అరుణ్‌కుమార్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేశ్.
 

Advertisement
 
Advertisement
Advertisement